« నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
Neeti vaagula koraku
(Dm) share with whatsapp

పల్లవి:
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు   
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది    (2X)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా   
నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా    (2X)
...నీటి...
1.
పనికిరాని నను నీవు పైకి లేపితివి   
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి    (2X)
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి   
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు   
నే వెంబడింతు ప్రభూ   
...నా ప్రాణమా...
2.
అంధకారపు లోయలలో నేను నడచినను   
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి    (2X)
కంటిపాపగ నీవని నిన్నుకొలిచితిమి   
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను   
ఇలలో నిన్ను కొలిచెదను   
...నా ప్రాణమా...