పల్లవి: |
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు |
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా |
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2X) |
1. |
లోక బంగారము – ధన ధాన్యాదులు |
ఒక పోగేసినా – నీతో సరితూగునా |
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు |
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా |
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన |
నీవేగా చాలిన దేవుడవు |
...నీతో... |
2. |
పలు వేదాలలో – మత గ్రంథాలలో |
పాపమే సోకని – పరిశుద్దుడేడి |
పాప పరిహారార్థం – సిలువ మరణమొంది |
తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు |
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా |
నీవేగా మంచి దేవుడవు |
...నీతో... |
3. |
నేను వెదకకున్నా – నాకు దొరికితివి |
నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి |
పలు గాయాలు చేసి – తరచు రేపితిని |
నన్నెంతో సహించి – క్షమియించితివి |
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి |
నీవేగా విమోచకుడవు |
...నీతో... |