పల్లవి: |
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి |
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని |
దాల్చుకొని సేవించుడి |
...నీతి... |
1. |
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా |
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును |
...నీతి... |
2. |
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు |
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను |
...నీతి... |
3. |
గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో |
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి |
...నీతి... |
4. |
పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని |
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు |
...నీతి... |
5. |
ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని |
వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి |
...నీతి... |
6. |
ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని |
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే |
...నీతి... |