పల్లవి: |
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2X) |
నీ వాక్యమును నేర్పించుము దానియందు నడచునట్లు నీతో |
...నీ స్వరము... |
1. |
ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము |
దినమంతటి కొరకు నను ||సిద్దపరచు ఆపదల నుండి|| |
...నీ స్వరము... |
2. |
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు |
నీ మార్గములో నడచునట్లుగా ||నేర్పించుము ఎల్లప్పుడు|| |
...నీ స్వరము... |
3. |
భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము |
అభయమూ నిమ్మూ ఓ గొప్ప దేవా ||ధైర్యపరచుము నన్ను|| |
...నీ స్వరము... |
నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే |
నీతో మనుజులతో సరిజేసుకొందు ||నీ దివ్య వాక్యము ద్వారా|| |
...నీ స్వరము... |