పల్లవి: |
నీ చేతితో నన్ను పట్టుకో - నీఆత్మతో నన్ను నడుపు |
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము |
1. |
అంధకార లోయలొన - సంచరించిన భయము లేదు |
నీ వాక్యము శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు (2X) |
...నీ చేతితో... |
2. |
ఘోర పాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని |
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2X) |
...నీ చేతితో... |
3. |
ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే |
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్ (2X) |
...నీ చేతితో... |