పల్లవి: |
నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీద ఏతెంచును |
మహిమాన్వితుడై ప్రభు యేసు - మహి స్థలమునకు ఏతెంచును |
...నేడో... |
1. |
చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నీయడు |
నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును |
...నేడో... |
2. |
కడబూర స్వరము ధ్వనియించగా - ప్రియుని స్వరము వినిపించగా |
వడివడిగ ప్రభు చెంతకు చేరెద - ప్రియమార ప్రభుయేసును గాంచెద |
...నేడో... |
3. |
నా ప్రియుడేసుని సన్నిధిలో - వేదన రోధనలుండవు |
హల్లెలూయ స్తుతి గీతాలతో - నిత్యము ఆనంద మానందమే |
...నేడో... |