పల్లవి: |
నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత |
1. |
యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా (2X) |
హానోకు వలె సాగెదా.. ఆ... |
...నే సాగెద... |
2. |
వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా (2X) |
మోషె వలె సాగెదా.. ఆ... |
...నే సాగెద... |
3. |
లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా (2X) |
స్తెఫను వలె సాగెదా.. ఆ... |
...నే సాగెద... |
4. |
తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా (2X) |
బలవంతునితో సాగెదా.. ఆ... |
...నే సాగెద... |
5. |
బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా (2X) |
పౌలు వలె సాగెదా.. ఆ... |
...నే సాగెద... |