« నజరేతు పట్నాన బెత్లెహేము పురములో
Nazarethu patnana
share with whatsapp

పల్లవి:
నజరేతు పట్నాన బెత్లెహేము పురములో   
యోసేపు మరియమ్మ బెత్లెహేము పురములో    
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
1.
మేము వెల్లి చూచినాము స్వామి యేసు నాదుని    (2X)
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనమ్బు లలరగ    (2X)
బెతలేము పురములోన బీద కన్య మరియకు    (2X)
పేద దాసు రూపు దాల్చి వెలసె పశుల పాకలో    (2X)
2.
పేద వడ్ల వారి కన్య మరియమ్మ   
ప్రేమ గల యేసు తల్లి-మరియమ్మ-ప్రేమ గల యేసు తల్లి    
పేరెల్లిన దేవ దేవుడే-యేసయ్య- ప్రేమ గల అవతారం    (2X)
స్వర్గ ధ్వారాలు తెరచిరి-యేసయ్య   
స్వర్గ రాజు బుట్టగానే-యేసయ్య-స్వర్గ రాజు బుట్టగానే   
సరుగూన దూతల్ వచ్చిరి -యేసయ్య-చక్కాని పాటల్ పాడిరి     (2X)
3.
నువ్ బోయే దారి లొ యేరుశాలేం గుడికాడ     (2X)
అచ్చం మల్లె పూల తోట-యేసయ్య    (2X)
దొడ్డు దొడ్డు బైబిలు దోసోట్లో బెట్టుకోని   
దోరల్లే బయిలెల్లినాడే -యేసయ్య   
4.
రాజుూలకూ రాజు బూట్టెన్నయ్య    (2X)
రారే జూడ మనం వెల్లుదాం అన్నయ్య    (2X)
తారన్ జూచి తూర్పు జ్ఙానల్ అన్నయ్య     (2X)
తరలీనారే బెత్లహేమన్నయ్య    (2X)
5.
పదరా పోదామురన్న-శ్రీ యేసుని చూడ- పదరా పోదాము రన్నా    (2X)
శ్రీ యేసన్న నట లోక రక్షకుడట    (2X)
లోకులందరి కయ్యో ఏక రక్షకుడట    (2X)
పదరా- హే-పదరా- హే   
పదరా పోదామురన్న-శ్రీ యేసుని చూడ- పదరా పోదాము రన్న    (4X)
**సవరణ** - 'నాగుమల్లె దరనిలో' బదులుగా 'బెత్లెహేము పురములో'   
అనే పదజాలము కొందరి సలహా మేరకు మార్చ బడినది