పల్లవి: |
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ |
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా |
...నా ప్రాణ... |
1. |
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా |
బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ |
...నా ప్రాణ... |
2. |
వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి |
ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా |
...నా ప్రాణ... |
3. |
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని |
నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా |
...నా ప్రాణ... |
4. |
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా |
నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును |
...నా ప్రాణ... |
5. |
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును - కృతజ్ఞత |
స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా |
...నా ప్రాణ... |
6. |
వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము |
ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా |
...నా ప్రాణ... |