« మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా
Melulu nee melulu
share with whatsapp

పల్లవి:
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా    (2X)
నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా   
1.
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా-   
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా     (2X)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా    (3X)
...మేలులు...
2.
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా-   
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా    (2X)
నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా    (3X)
...మేలులు...
3.
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా-   
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా    (2X)
నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా    (3X)
...మేలులు...