పల్లవి: |
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది (2X) |
1. |
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు |
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు (2X) |
...మహోన్నతుడా... |
2. |
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా |
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా (2X) |
...మహోన్నతుడా... |
3. |
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా |
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా (2X) |
...మహోన్నతుడా... |