పల్లవి: |
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2X) |
యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2X) |
...లెమ్ము... |
1. |
జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు (2X) |
రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చేదరు (2X) |
...లెమ్ము... |
2. |
సముద్ర వ్యాపారములు నీ వైపు త్రిప్పబడును (2X) |
జనము-ల ఐశ్వర్యము నీ యోద్డ-కు వచ్చును (2X) |
...లెమ్ము... |
3. |
దేవదారు సరళ గొంజి-చెట్లు నా ఆలయమునకు (2X) |
తే బడును నాదు పాద-స్థలము మహిమ పరచెదను (2X) |
...లెమ్ము... |
4. |
నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగ- జేతున్ (2X) |
బహుతరములకు సంతోష-కారణముగ జేసెదను (2X) |
...లెమ్ము... |
5. |
వారిలొ ఓంటరియైన-వాడు పదివంద లగును (2X) |
ఎన్నిక లేనివాడు - బలమైనట్టీ జనమగును (2X) |
...లెమ్ము... |