పల్లవి: |
కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2X) |
1. |
మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2X) |
ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను |
...కృపలను... |
2. |
రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2X) |
నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు |
...కృపలను... |
3. |
కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2X) |
నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు |
...కృపలను... |
4. |
సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి (2X) |
సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో |
...కృపలను... |
5. |
హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే (2X) |
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్ |
...కృపలను... |