పల్లవి: |
క్రొత్త యెడు మొదలు బెట్టెను - మన బ్రతుకు నందు - క్రొత్త యెడు |
మొదలు బెట్టెను - క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభుని సేవ |
దత్తరపడకుండజేయు - టుత్తమోత్తమంబు జూడ |
1. |
పొంది యున్న మేలులన్నియు - బొంకంబుమీఱ - డెందమందు |
స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు - పందెమందు |
బారవలయు నందముగను రవిని బోలి - నలయకుండ సొలయకుండ |
...క్రొత్త... |
2. |
మేలు చేయదడవొనర్చగా - మీరెఱగునట్లు కాలమంత నిరుడు |
గడచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేల సేయవలయు |
జాల జనము కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు |
...క్రొత్త... |
3. |
బలములేని వారమయ్యును - బలమొందవచ్చు - గలిమి మీఱ గర్త |
వాక్కున - నలయకుండ నడగుచుండ - నలగకుండ మోదమొంది |
బలమొసంగు సర్వవిధుల - నెలవి మీరనర్చుచుండ |
...క్రొత్త... |
4. |
ఇద్దరిత్రి నుండునప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి బొంద జూడ |
వలయును - బుద్ధి నీతిశుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధజేయు - శుద్దులైన |
వారిలొ - బ్ర - సిద్దులగుచు వెలుగవచ్చు |
...క్రొత్త... |
5. |
పాప పంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తుయేసు - ప్రాపు జేరి మీరు |
వేడగా - నేపు మీఱదనదు కరుణ - బాపమంత గడిగివేసి |
పాప రోగ చిహ్నాలన్ని - బాపివేసి శుద్ధిచేయు |
...క్రొత్త... |