పల్లవి: |
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి |
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి |
...క్రీస్తే... |
1. |
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత |
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన |
...క్రీస్తే... |
2. |
దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి |
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన |
...క్రీస్తే... |
3. |
శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి |
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన |
...క్రీస్తే... |
4. |
సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ |
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన |
...క్రీస్తే... |
5. |
మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ |
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన |
...క్రీస్తే... |
6. |
పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన |
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన |
...క్రీస్తే... |
7. |
ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు |
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన |
...క్రీస్తే... |