పల్లవి: |
కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ-కొనియాడఁ దరమె నిన్ను |
తనరారు దినకరు-బెనుతారలను మించు-ఘనతేజమున నొప్పు-కాంతిమంతుఁడ వీవు |
1. |
ఖేరుబులు సెరుపులు – మరి దూత గణములు |
నూరుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు |
...కొనియాడఁ... |
2. |
సర్వలోకంబులఁ – బర్వు దేవుడ వయ్యు |
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు |
...కొనియాడఁ... |
3. |
విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు |
పశ్వాళితోఁ దొట్టి – పండియుంటివి నీవు |
...కొనియాడఁ... |
4. |
దోసంబులను మడియు – దాసాళి గరుణించి |
యేసుపేరున జగతి కేగుదెంచితినీవు |
...కొనియాడఁ... |
5. |
నరులయందున గరుణ – ధర సమాధానంబు |
చిరకాలమును మహిమ పరగ జేయుదు వీవు |
...కొనియాడఁ... |
6. |
ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేగొని |
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత |
...కొనియాడఁ... |