పల్లవి: |
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా |
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా |
కరుణ చూపి కలత మాన్పె (2X) యేసే తోడమ్మా |
...కన్నీరేలమ్మా... |
1. |
నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా |
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా |
చింతించకన్న యేసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2X) |
...కన్నీరేలమ్మా... |
2. |
నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా |
పురుగంటివాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా |
నేనున్నానన్న యేసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2X) |
...కన్నీరేలమ్మా... |