« కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
Kanneerelamma karuninchu yesu ninnu
share with whatsapp

పల్లవి:
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా   
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా   
కరుణ చూపి కలత మాన్పె (2X) యేసే తోడమ్మా    
...కన్నీరేలమ్మా...
1.
నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా   
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా   
చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా    (2X)
...కన్నీరేలమ్మా...
2.
నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా   
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా   
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా    (2X)
...కన్నీరేలమ్మా...