పల్లవి: |
కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా |
నిను చూడ మనసాయెనయ్యా -యేసయ్యా (2X) |
...కనలేని... |
1. |
ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2X) |
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా |
...కనలేని... |
2. |
దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2X) |
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా |
...కనలేని... |
3. |
మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2X) |
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా |
...కనలేని... |
4. |
రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2X) |
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా |
...కనలేని... |
5. |
అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2X) |
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా |
...కనలేని... |