పల్లవి: |
జీవము నిచ్చిన పరమపితా – నీకే స్తుతి ఆరాధానా |
రక్తము చిందించి రక్షించినా యేసుక్రీస్తు ఆరాధనా |
బలపరుచు నను స్తిరపరచు పరిశుద్దాత్మ ఆరాధన |
ఆరాధన…. ఆరాధన…. ఆరాధన… ఆరాధన… (2X) |
...జీవము... |
1. |
నాలో ఉన్న ఊపిరి – నీవు ఇచ్చిన కానుక |
నేను పొందిన రక్షణ – నీవు చేసిన త్యాగము (2X) |
జీవించినా మరణించినా ఇక నికోసమే యేసయ్య (2X) |
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2X) |
ఆరాధన…. ఆరాధన…. ఆరాధన… ఆరాధన… (2X) |
...జీవము... |
2. |
జీవమోసగు ఆత్మచే – అనుదినము నను పోషించు |
నీదు బాటలో పయనింప – దారిని నాకు చూపించు (2X) |
చాలును నాకు నీ కృప – నిత్యము నేను జీవించేద (3X) |
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2X) |
ఆరాధన…. ఆరాధన…. ఆరాధన… ఆరాధన… (2X) |
...జీవము... |