« జయ రాజు యేసు జండ క్రింద
Jayaraju yesu janda krindha
share with whatsapp

పల్లవి:
జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తిమి   
భయంలేక పరమ బలమొంది మనము పనిని జేయుదము   
అను పల్లవి:
జయగీతం పాడి యుద్దము జేసి జయము నొందెదము   
...జయ రాజు...
1.
సేన నాయకుడు నడిపించెను మమ్మును దివ్యజ్ఞానముతో   
దీన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయదము   
...జయగీతం...
2.
దేశవాసులెల్లరు దేవునితో సహవాస మొందుటకే   
వంచించు సైతాన్ వలనుండి వారిని విడిపించుట మా పని   
...జయగీతం...
3.
సర్వలోకమంతయు నెప్పుడు యేసుకు స్వంత మగుచున్నదో   
అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను   
...జయగీతం...