పల్లవి: |
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో |
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం |
సంతోషించు ఈ దినం |
...ఇన్నేళ్లు... |
1. |
లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2X) |
పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం |
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం |
...ఇన్నేళ్లు... |
2. |
మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2X) |
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా |
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం |
...ఇన్నేళ్లు... |