పల్లవి: |
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట |
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా |
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు |
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా |
ఆ..అర్ధరాత్రి కాలమందు వెన్నెల... ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల... ఆహా (2X) |
జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా (2X) |
...ఇళ్లలోన... |
1. |
హా...ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా-||చెప్పవే|| (2X) |
ఆ... యూదా దేశమందు వెన్నెల... ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా (2X) |
రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెల (2X) |
...ఇళ్లలోన... |
2. |
ఆహ.. తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా-||చెప్పవే|| (2X) |
తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల... ఆహా దర్శింప వచ్చినారు వెన్నెల... ఆహా (2X) |
బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2X) |
...ఇళ్లలోన... |
3. |
ఆ..దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా-||చెప్పవే|| (2X) |
పాపులైన మనకోసం వెన్నెల..ఆహా ప్రాణాన్ని అర్పించి వెన్నెలా (2X) |
పరలోకానికి మార్గం వెన్నెలా ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2X) |
...ఇళ్లలోన... |
4. |
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా-||చెప్పవే|| (2X) |
యేసయ్యను నమ్ముకో వెన్నెల.. ఆహా పాపాలను ఓప్పుకో వెన్నల ఆహా (2X) |
క్రొత్తగా జన్మించు వెన్నెలా రక్షణను పొందుకో వెన్నెలా (2X) |
...ఇళ్లలోన... |