« ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
Idhigo dheva naa jeevitham
share with whatsapp

పల్లవి:
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం   
శరణం నీ చరణం - శరణం నీ చరణం    (2X)
1.
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి   
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి    (2X)
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు   
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం   
...ఇదిగో...
2.
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు   
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్దించి పనిచేయ నేర్పు    (2X)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము   
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము   
...ఇదిగో...
2.
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము   
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు    (2X)
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా   
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా   
...ఇదిగో...