పల్లవి: |
ఇది శుభోదయం-క్రీస్తు జన్మదినం |
ఇది లోక కళ్యాణం - మేరి పుణ్యదినం (2X) |
1. |
రాజులనేలే రారాజు వెలసెను పశువుల పాకలో |
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో |
భయము లేదు మనకిలలో |
జయము జయము జయమహౌ |
...ఇది... |
2. |
గొల్లలు జ్ఙానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో |
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితొ |
జయ నాదమే ఈ భువిలో |
ప్రతిధ్వనించెను ఆ దివిలో |
...ఇది... |