« హోసన్న హోసన్నా యూదుల రాజుకే
Hosanna hosanna yudhula raajuke
share with whatsapp

పల్లవి:
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్    (2X)
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి-   
బాగుచేయమని కోరెదన్    (2X)
అను పల్లవి:
హోసన్న హోసన్నా యూదుల రాజుకే   
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే   
1.
మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును    (2X)
మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే    (2X)
...హోసన్న...
2.
అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే     (2X)
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే    (2X)
...హోసన్న...
3.
ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయూ    (2X)
నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని    (2X)
...హోసన్న...