పల్లవి: |
హల్లెలూయ యని పాడి స్తుతింపను |
రారె జనులారా మనసారా ఊరూర |
రారే జనులార ఊరూర నోరార |
...హల్లెలూయ... |
1. |
పాడి పంటలనిచ్చి - పాలించి దేవుడని (2X) |
కూడు గుడ్డల నిచ్చి -పోషించు దేవుడని (2X) |
తోడు నీడగ నిన్ను - కాపాడె నాధుడని (2X) |
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె |
...హల్లెలూయ... |
2. |
తాత ముత్తాతలకన్న - ముందున్న దేవుడని (2X) |
కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని (2X) |
తల్లి దండ్రులకన్నప్రేమించు దేవుడని (2X) |
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె |
...హల్లెలూయ... |
3. |
బందూ మిత్రులకన్నా - బలమైన దేవుడని (2X) |
అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని (2X) |
కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని (2X) |
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె |
...హల్లెలూయ... |
4. |
రాజాధి రాజులకన్న రాజైన దేవుడని (2X) |
నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని (2X) |
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని (2X) |
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె |
...హల్లెలూయ... |