పల్లవి: |
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ |
రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ |
హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2X) |
...గొప్ప... |
1. |
అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2X) |
అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2X) |
...హల్లెలూయా... |
2. |
సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని (2X) |
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2X) |
...హల్లెలూయా... |