పల్లవి: |
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2X) |
యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2X) |
...గీతం... |
1. |
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను (2X) |
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు (2X) |
...గీతం... |
2. |
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు (2X) |
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి (2X) |
...గీతం... |
3. |
అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి (2X) |
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి (2X) |
...గీతం... |
4. |
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా (2X) |
మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి (2X) |
...గీతం... |