« ఎవరు నన్ను చేయి విడచినన్‌
Evaru nannu cheyi vidachinan
share with whatsapp

పల్లవి:
ఎవరు నన్ను చేయి విడచినన్‌-యేసు చేయి విడువడు    (2X)
చేయి విడువడు (3X) నన్ను చేయి విడువడు   
...ఎవరు...
1.
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2X) లాలించును పాలించును (2X)   
...ఎవరు...
2.
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2X) వేడుకొందునే కాపాడునే (2X)    
...ఎవరు...
3.
రక్తము తోడ కడిగి వేసాడే (2X) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2X)   
...ఎవరు...
4.
ఆత్మ చేత అభిషేకించి (2X) వాక్యముచే నడుపుచున్నాడే (2X)    
...ఎవరు...