పల్లవి: |
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2X) |
పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము (2X) |
1. |
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి-విశ్వాసమనే డాలుని చేత పట్టి (3X) |
ముందుకే దూసుకెళ్లెద యెహోవాదే యుద్ధమనుచు (2X) |
...ఎంత... |
2. |
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి -సాతాను తంత్రములు తొక్కి పెట్టి (3X) |
ముందుకే దూసుకెళ్లెద యెహోవా నిస్సీ అనుచు (2X) |
...ఎంత... |
3. |
యేసు కాడిని భుజాన పెట్టి -వాగ్ధాన తలుపు విసుగక తట్టి (3X) |
ముందుకే దూసుకెళ్లెద సిలువలో సమాప్తమైనదనుచు (2X) |
...ఎంత... |