« ఎంత కృపామయుడవు యేసయ్యా
Entha krupaamayudavu yesayya
share with whatsapp

పల్లవి:
ఎంత కృపామయుడవు యేసయ్యా   
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా    (2X)
నలిగితివి వేసారితివి    (2X)
నాకై ప్రాణము నిచ్చితివి    (2X)
...ఎంత...
1.
బండలాంటిది నాదు మొండి హృదయం   
ఎండిపోయిన నాదు పాత జీవితం    (2X)
మార్చినావు నీ స్వాస్థ్యముగా    (2X)
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము    (2X)
...ఎంత...
2.
కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ   
ఈ లోకము నన్ను విడచిననూ    (2X)
మరువలేదు నన్ను విడువలేదు    (2X)
ప్రేమతో పిలచిన నాథుడవు    (2X)
...ఎంత...
3.
కరువులు కలతలు కలిగిననూ   
లోకమంతా ఎదురై నిలచిననూ    (2X)
వీడను ఎన్నడు నీ సన్నిధి    (2X)
నీ త్యాగమునే ధ్యానించెదన్    (2X)
...ఎంత...