పల్లవి: |
దేవుని యందు నిరీక్షణనుంచి - ఆయనను స్తుతించు నా ప్రాణమా |
1. |
ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2X) |
ప్రతిక్షణం నీపక్షముండు - రక్షకుడు |
...దేవుని... |
2. |
చీకటిని వెలుగుగా చేసి - ఆయనే నీముందు పోవువాడు (2X) |
సత్యమగు - జీవమగు - మార్గ - మేసె |
...దేవుని... |
3. |
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను (2X) |
తల్లి కన్నా - తండ్రి కన్నా - ఉత్తముడు |
...దేవుని... |
4. |
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొనువాడు ఆయనే (2X) |
ఆధారము - ఆదరణ - ఆయనలో |
...దేవుని... |
5. |
నీకు విరోధముగా రుపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు (2X) |
శత్రువులు - మిత్రులుగా - మారెదరు |
...దేవుని... |
పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2X) |
కనికర - సంపన్నుడు - నాదేవుడు |
...దేవుని... |
7. |
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2X) |
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ |
...దేవుని... |