పల్లవి: |
దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై |
బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను |
1. |
దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్ |
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై |
...దేవర... |
2. |
ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో |
శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము |
...దేవర... |
3. |
ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస |
దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ |
...దేవర... |
4. |
తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా - |
వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును |
...దేవర... |
5. |
సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా |
గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ |
...దేవర... |
6. |
మెండుగ భూ మండలపు - గుండములలో వీరుండగను |
దండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండింపన్ |
...దేవర... |
7. |
ఇద్దర వీరిద్దరును - శుద్దులై నిన్ను సేవించుటకై |
శ్రద్దతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ |
...దేవర... |
8. |
వాసగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని |
మా సకలేశ్వర నీ సుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్ |
...దేవర... |