పల్లవి: |
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి |
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా |
దేవుని - పావన నామము నుతించుమా - నా యంతరంగము - లో |
వసించు - నో సమస్తమా - ఆ కారణముచే |
...దేవ... |
1. |
జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు |
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్ |
లే కుండ జేయును - ఆ కారణముచే |
...దేవ... |
2. |
చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను |
జీవ కీరీ టముగ వేయును - నీ శిరసు మీద - జీవ |
కీరీ టముగ వేయును - ఆ కారణముచే |
...దేవ... |
3. |
యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త |
యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును |
సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే |
...దేవ... |
4. |
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్ |
విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను |
విప్పె నిశ్రా యేలు జనమునకు - ఆ కారణముచే |
...దేవ... |
5. |
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు |
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు |
నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే |
...దేవ... |
6. |
పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు |
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ |
భక్త జనులయందున - ఆ కారణముచే |
...దేవ... |
7. |
పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు |
నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను |
యెడము గానే చేసియున్నాడు - ఆ కారణముచే |
...దేవ... |
8. |
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల |
యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల |
జాలి పడును దేవుండు- ఆ కారణముచే |
...దేవ... |
9. |
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి |
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు |
కరుణ జూపు చుండును - ఆ కారణముచే |
...దేవ... |
10. |
పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస |
పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము |
మన దేవకృప మెండు - ఆ కారణముచే |
...దేవ... |
11. |
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు |
నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి |
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే |
...దేవ... |