పల్లవి: |
దేవా దేవా నన్ను కావుమా (2X) |
నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె నా దీపమై |
నీ నీడలో నను నిలుపుమా – నీ ఆత్మతో నను నింపుమా |
...దేవా... |
1. |
కారు చీకటి మార్గములో భారమైన పయనంలో |
మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో |
శృతిని మీటే (నీ) పలుకులే నను (2X) |
పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా |
...దేవా... |
2. |
నీదు మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుమ |
యెహోవా యీరే నీవే నా సర్వమై – యెహోవా నిస్సి నా విజయం నీవని |
యెహోవా రోఫెక స్వస్థత నీవై – యెహోవా షమ్మా తోడు ఉందువని |
ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువా |
...దేవా... |