పల్లవి: |
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము |
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2X) |
అను పల్లవి: |
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2X) |
...ధన్యము... |
1. |
ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2X) |
ఎవరి పాపములు – మన్నించబడెనో (2X) |
...వారె ధన్యులు... |
2. |
క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2X) |
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2X) |
...వారె ధన్యులు... |
3. |
ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2X) |
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2X) |
...వారె ధన్యులు... |
4. |
ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2X) |
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2X) |
...వారె ధన్యులు... |
5. |
శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2X) |
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2X) |
...వారె ధన్యులు... |