పల్లవి: |
దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము |
మహా వినోదు డాపదల సహాయుడై నన్ బ్రోచున |
అభయ మభయ మభయ మెప్పుడానంద |
మానంద మానంద మౌగ |
...దేవుడే... |
1. |
పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను |
సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ |
...అభయ... |
2. |
దేవు డెపుడు తోడుగాగ దేశము వర్ధిల్లును |
ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు |
...అభయ... |
3. |
రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన |
పూజ్యుండౌ యెహోవా వైరి బూని సంహరించును |
...అభయ... |
4. |
విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన |
చెల్లచెదర జేసి రిపుల నెల్లద్రుంచు నాయనే |
...అభయ... |
5. |
పిశాచి పూర్ణబలము నాతో బెనుగులాడ జడియును |
నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును |
...అభయ... |
6. |
కోటయు నాశ్రయమునై యా కోబు దేవు డుండగ |
ఏటి కింక వెరవ వలయు నెపుడు నాకు బండుగ |
...అభయ... |
1. |
Dhevude na kashryambu dhivyamaina dhurgamu |
maha vinodu dhapadala sa hayudai nan brochunu |
abhaya mabhaya mabhaya meppu |
danandha manandha manandha mouga |
...devude... |
2. |
parvathamulu kadhilina nee yurvi maarupadinanu |
sarvamun ghoshinchuchu nee sandhra mupponginan |
...abhaya... |
3. |
dhevudepdu thodugaga dheshamu vardhillunu |
aa thavu nandu prajalu migula dhanyuly vasinthuru |
...abhaya... |
4. |
rajyamul kampinchina bhu rashtramul ghoshinchina |
poojyundou yehova vairi booni samharinchunu |
...abhaya... |
5. |
villu varachu naayana thega ballemu naraku naayana |
chella chedhara jesi ripula nelladhrunchu naayane |
...abhaya... |
6. |
pishachi poornabalamu naatho benugulada jhadiyunu |
nashinchi shathruganamu devu naagna valana madiyunu |
...abhaya... |
7. |
Kotayu naashrayamunai yaa kobu devundaga |
eti kinka verava valayu neupudu naaku banduga |
...abhaya... |