పల్లవి: |
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా |
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా |
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా |
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2X) |
1. |
బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం |
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2X) |
2. |
కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం |
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2X) |
...చిరకాల... |
3. |
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం |
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2X) |
...చిరకాల... |