« భయము లేదు – దిగులు లేదు జీవిత యాత్రలో
Bhayamu ledhu dhigulu ledhu
share with whatsapp

పల్లవి:
భయము లేదు – దిగులు లేదు – జీవిత యాత్రలో   
యేసు ప్రభువు – మనతోనుండ – భయము లేదుగా   
హల్లేలూయ – హల్లేలూయ    (2X)
...భయము లేదు...
1.
గాలి తుఫాను రేగి అలలు పొంగినా   
విశ్వాస నావ మునిగి కొట్టబడిన   
సముద్రము పొంగి – నురుగు కట్టిన   
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా    (2X)
...భయము లేదు...
2.
వ్యాధి భాధలు నన్ను ముట్టినా   
అంతులేని వేదనా నాకు కల్గిన   
గర్జించు సింహము – ఎదురు వచ్చిన   
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా    (2X)
...భయము లేదు...
3.
శత్రువున్‌ చూచి విస్మయమొందకు   
నీతో కూడా వచ్చువాడు నీదేవుడే   
నిన్ను విడువడెన్నడు ఎడబాయడు   
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా    (2X)
...భయము లేదు...