పల్లవి: |
భాసిల్లెను సిలువలొ పాప క్షమ - యేసు ప్రభో నీ దివ్య క్షమ |
1. |
కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను |
ఆహుతి జేసి - కలుషహరా కరుణించితివి |
...భాసిల్లెను... |
2. |
దోషము చేసినది నేనెకదా - మోసములో బ్రతికిన |
నేనెకదా - మోసితివా నా శాపభారం |
...భాసిల్లెను... |
3. |
పాపము చేసి గడించితి మరణం - శాపమేగా |
నే నార్జించినది - కాపరివై నను బ్రోచితివి |
...భాసిల్లెను... |
4. |
ఎందులకో నాపై యీ ప్రేమ - అంద దయాస్వామీ |
నా మదికి - అందులకే భయ మొందితిని |
...భాసిల్లెను... |
5. |
నీ మరణపు వేదన వృధాకాదు - నా మది నీ వేదనలో |
మునిగే - క్షేమము కలిగెను హృదయములో |
...భాసిల్లెను... |
6. |
నమ్మిన వారిని కాదనవనియు - నెమ్మది నొసగెడు |
నా ప్రభుడవని - నమ్మితిని నీ పాదమ్ములను |
...భాసిల్లెను... |