పల్లవి: |
అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా (2X) |
నెపమెంచకయె నీ కృపలో- నపరాధములను క్షమించు (2X) |
1. |
సిలువకు నిను నే గొట్టి తులువాలతొ జేరితిని (2X) |
కలుషంబులను మోపితిని-దోషుండ నేను ప్రభువా (2X) |
2. |
ప్రక్కలో బల్లెపుపోటు-గ్రక్కున పొడచితి నేనే (2X) |
మిక్కిలి బాధించితిని-మక్కువ జూపితివయ్యా (2X) |
3. |
ముళ్ళతో కిరీటంబు-నల్లీ నీ శిరమున నిడితి (2X) |
నా వల్ల నేరమాయే-చల్లని దయగల తండ్రి (2X) |
4. |
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2X) |
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయంబులను (2X) |
5. |
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2X) |
కృూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2X) |
6. |
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2X) |
అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా (2X) |
7. |
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2X) |
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా (2X) |