పల్లవి: |
అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము |
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామమూ |
యేసు నామము - జయం జయమూ |
సాతాను శక్తుల్ - లయం లయమూ (2X) |
హల్లేలూయ హోసన్న - హల్లేలూయ |
హల్లేలూయ - ఆమేన్ (2X) |
1. |
పాపములనుండి విడిపించును - యేసుని నామము (2X) |
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును - క్రీస్తేసు నామము (2X) |
...యేసు నామము... |
2. |
సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన - యేసు నామము (2X) |
శత్రు సమూహము పై జయము నిచ్చును - జయశీలుడైన యేసు నామము (2X) |
...యేసు నామము... |
3. |
రోగములనుండి విడిపించును - యేసుని నామము (2X) |
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2X) |
...యేసు నామము... |