పల్లవి: |
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో |
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ (2X) |
ఆనందసంద్ర ముప్పొంగె నాలొ అమరకాంతిలో |
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని |
...అందాల తార... |
1. |
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను |
వింతైన శాంతి వర్షించె నాలో విజయపధమున (2X) |
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతో |
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ |
...అందాల తార... |
2. |
యెరూషలేము రాజనగరిలొ యేసుని వెదకుచు |
ఎరిగిని దారి తొలగిన వేళ ఎదలొ కృంగితి (2X) |
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో |
ఎంతో యబ్బురపడుచు విస్మయ మెుందుచు ఏగితి స్వామి కడకు |
...అందాల తార... |
3. |
ప్రభు జన్మస్థలము పాకయేగాని పరలోక సౌధమే |
బాలునిజూడ జీవితమెంత పావనమాయేను (2X) |
ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము |
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన |
...అందాల తార... |