పల్లవి: |
అలలపైన నడచినా నా యేసు నాతో వున్నావు (2X) |
అంతులేని సాగరమునకు నాదు రేవు నీవేగా (2X) |
...అలలపైన... |
1. |
తుఫానులు చెలరేగినా పెను గాలులెన్నో వీచినా (2X) |
నావలో నీవుండగా (2X) |
జడియకా సాగెదన్ ని సేవలో |
...అలలపైన... |
2. |
నీదు వాగ్ధాన పలుకులే నాదు జ్ఙానమై సదా (2X) |
నీవే నా నిరీక్షణై (2X) |
నిరతము నడుతును నా రాజ |
...అలలపైన... |