పల్లవి: |
ఆహా మహానందమే - ఇహ పరంబులన్ |
మహావతారుండౌ - మా యేసు జన్మదినం - హల్లేలూయ |
...ఆహా... |
1. |
కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు (2X) |
మాన్యలౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందరో (2X) |
నిన్నారాధించిరి - హల్లేలూయ |
...ఆహా... |
2. |
యెహోవా తనయా - యేసు ప్రభూ సహాయుడా - మా స్నేహితుడా (2X) |
ఇహ పరంబుల ఓ ఇమ్మానుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము (2X) |
నిన్నారాధింతుము - హల్లేలూయ |
...ఆహా... |
3. |
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X) |
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రించు వేళలో (2X) |
నిన్నారాధింతుము - హల్లేలూయ |
...ఆహా... |