పల్లవి: |
ఆశిర్వాదంబుల్ మా మీద-వర్షింపజేయు మీశ |
ఆశతోనమ్మీ యున్నాము-నీ సత్య వాగ్ధత్తము |
ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా |
క్రమ్మార ప్రేమ వర్షంబున్- గ్రుమ్మరించుము దేవా |
1. |
ఓ దేవా పంపివయ్యా-నీ దీవెన ధారలన్ |
మా దాహమెల్లను బాపు-మాధుర్యమౌ వర్షమున్ |
...ఇమ్మాహి... |
2. |
మా మీద కురియించు మీశ-ప్రేమ ప్రవాహంబులన్ |
సమస్త దేశంబు మీద-క్షామంబు పోనట్లుగన్ |
...ఇమ్మాహి... |
3. |
ఈనాడే వర్షింపు మీశ-నీ నిండు దీవెనలన్ |
నీ నామమందున వేడి-సన్నుతి బ్రార్ధింతుము... ఆమేన్ |
...ఇమ్మాహి... |