« మణులు మాణిక్యములున్న
Manulu manikyamulunna
share with whatsapp

పల్లవి:
మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా   
మదిలొ యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా   
1.
చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా   
విద్య వున్నా బుద్ది వున్నా - జ్ఞానమున్నా అది సున్నా   
...మణులు...
2.
అందచందా లెన్నున్నా - అందలముపై కూర్చున్నా   
సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా   
...మణులు...
3.
రాజ్యములు రమణులున్నా - శౌర్యములు గల వీరులున్నా   
బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా   
...మణులు...
4.
పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా   
దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా   
...మణులు...